రోజూ ఒక క్యారెట్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. క్యారెట్లలో అనేక పోషకాలు ఉంటాయి. క్యారెట్లలో బీటాకెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. దీంతో కంటిచూపు మెరుగు పడుతుంది. రేచీకటి సమస్య కూడా ఉండదు. క్యారెట్ తింటే గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. బీపీ నియంత్రణలో, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.