మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాన్ని నిరసిస్తూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా చేసినట్లు వార్తలు హల్చల్ చేశాయి. దీంతో ఆయన స్పందిస్తూ.. ఆ వార్తలు నిజం కాదని కొట్టిపారేశారు. రాజీనామా చేయలేదని వెల్లడించారు. మహా వికాస్ అఘాడీ కూటమి చెక్కుచెదరకుండా ఉందన్నారు. మహారాష్ట్రలో 288 సీట్లకు గానూ.. మహాయుతి 233 స్థానాల్లో గెలిచింది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి 48 చోట్ల గెలుపొందింది.