మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు జాప్యం జరుగుతోంది. BJP, శివసేన, NCP నేతలు CM పదవిపై ఇంకా నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఏక్నాథ్ షిండేను CMగా కొనసాగించాలని శివసేన గట్టిగా పట్టుబడుతుంది. BJP ఎమ్మెల్సీ ప్రవీణ్ డరేకర్ మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్‌ను CMగా ఎంపిక చేయాలని కోరుతున్నారు. రాష్ట్రాన్ని నడపటానికి ఆయనే సమర్థుడని వాదిస్తున్నారు.