బియ్యం కడిగిన నీళ్లతో చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నీళ్లతో జుట్టు, చర్మ సమస్యలు తగ్గుతాయి. బియ్యం కడిగిన నీళ్లను జుట్టుపై పోసి మర్దన చేయాలి. దీంతో జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ నీళ్లు చర్మాన్ని కాపాడటంతో పాటు తేమను అందిస్తాయి. ముఖంపై మంటను తగ్గిస్తాయి. బియ్యం కడిగిన నీటిని మరిగించి తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అజీర్తి దూరమవుతుంది. రక్తపోటు తగ్గుతుంది.