చలి కాలంలో వాయు కాలుష్యం, వాతావరణ కాలుష్యం అధికంగా ఉంటాయి. దుమ్ము, ధూళి వల్ల కంటిపై ప్రభావం పడుతుంది. కళ్లు ఎర్రబడటం, దురద, మంట, శ్వాసకోశ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బయటకెళ్లినప్పుడు మాస్క్ ధరించాలి. కళ్లజోడు పెట్టుకోవాలి. బయటకెళ్లి వచ్చిన తర్వాత ముఖం, కళ్లను నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. కంటినొప్పికి కోల్డ్ కంప్రెస్ తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.