ప్రస్తుతం ఉన్న బిజీ కాలంలో చాలామంది మనస్ఫూర్తిగా నవ్వడమే మానేశారు. నవ్వు మంచి వ్యాయామం లాంటిదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ నవ్వడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు ఒత్తిడి తగ్గుతుంది. గట్టిగా నవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. శరీరంలో నొప్పులు తగ్గుతాయి. ఇది శరీరానికి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది. మైగ్రేన్, రక్తపోటు, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రతి రోజూ 10-15 నిమిషాల పాటు నవ్వితే మంచిది.