US: తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని నిలిపివేస్తానంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చెప్పారు. తాజాగా ఆ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారట. రష్యా, ఉక్రెయిన్ సైన్యాల మధ్య 800 మైళ్ల బఫర్ జోన్‌ను అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు నాటాలో చేరకుండా సుధీర్ఘకాలం దూరంగా ఉండేందుకు ఉక్రెయిన్ అంగీకరించనుందట. దీనికి బదులుగా ఆ దేశానికి US భారీగా ఆయుధ సంపత్తిని సమకూర్చనుందట.