మహిళల్లో ఎక్కువగా అనారోగ్య సమస్యలకు కారణమయ్యేది థైరాయిడ్. దీన్ని అదుపులో పెట్టుకోవాలంటే ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఆహార నియమాలు పాటించాలి. అయోడిన్, జింక్, ఐరన్, కాపర్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలు, చేపలు, పుట్టగొడుగులు తినాలి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రొకలీ, సోయా, చిక్కుళ్లు, పల్లీలు వంటివి అస్సలు తినకూడదు. రోజూ వాకింగ్, యోగా చేయాలి.