శీతాకాలంలో ట్రిప్ వెళ్లాలనుకునేవారికి IRCTC శుభవార్త చెప్పింది. మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర పేరిట టూరింగ్ ప్యాకేజీని తీసుకొచ్చింది. దీంతో ఘృష్ణేశ్వర ఆలయ సందర్శనంతో పాటు అజంతా, ఎల్లోరా గుహల్ని చూడవచ్చు. రైలు టికెట్ ధర రూ.7,460 నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 15,22,29, డిసెంబర్ 6,13,20,27 తేదీల ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. కాచిగూడ, మల్కాజ్గిరి, కామారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్ స్టేషన్లో ఈ రైలు ఎక్కొచ్చు.