ఒత్తిడి తట్టుకోలేక ఓ BJP మహళా నేత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుజరాత్లో జరిగింది. సూరత్‌లోని 30వ వార్డు BJP మహిళా మోర్చా విభాగానికి దీపికా పటేల్ నాయకత్వం వహిస్తున్నారు. సదరు మహిళా నేత ఒత్తిడిని తట్టుకోలేక తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యాయత్నంపై సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.