గాజా కాల్పుల విరమణ ఒప్పందం చర్చల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ చర్చలకు మధ్యవర్తి పాత్ర నుంచి ఖతార్ తప్పుకుంది. ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్‌లు సంపూర్ణ విశ్వాసంతో చర్చలు జరపడం లేదని, ఈ నేపథ్యంలో మధ్యవర్తిగా ఉండటంలో ఫలితం లేదని ఖతార్ వైదొలిగినట్లు తెలుస్తోంది. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 13 మంది మరణించారు.