AP: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. మాజీ సీఎం జగన్తో పాటు కుటుంబ సభ్యులపై అసభ్యంగా పోస్టులు పెడితే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ తనపై కూడా పోస్టులు పెట్టారని ధ్వజమెత్తారు. డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యలు లేవని తెలిపారు. వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.