NRML: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటలలో 250.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా దిలావర్పూర్ మండలంలో 62.2, సారంగాపూర్ 51.2, నిర్మల్ గ్రామీణ 31.2, సొన్ 34.0, లక్ష్మణచందాలో 14.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందన్నారు. రాబోయే 24 గంటలలో జిల్లాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు.