TG: రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని మాజీ CM KCR ఆరోపించారు. రూ.13 వేల కోట్ల ఆదాయం తగ్గిందని కాగ్ స్పష్టం చేసిందన్నారు. మరో 4 నెలలైతే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని అబిప్రాయం వ్యక్తం చేశారు. తనను ఉద్దేశించి ఫామ్‌హౌస్ అంటుండటంపై కేసీఆర్ స్పందించారు. ఇక్కడ అల్లం, ఉల్లిపాయ తప్ప ఏమున్నాయి? వాళ్లు వస్తే పార ఇచ్చి తవ్వుకోమందామని ఎద్దేవా చేశారు.