ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ రాంచీలో భారీ రోడ్ షో నిర్వహించారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర రోడ్‌షోలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేశారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలు మోదీకి ఘనస్వాగతం పలికారు. అంతకముందు గుమ్లాతోపాటు పలుచోట్ల నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించిన మోదీ జేఎంఎం- కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.