TG: ఏడాది పాలనపై కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయోత్సవాపై కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైర్లు వేశారు. ఏం సాధించారని ప్రజా విజయోత్సవాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలు చేశారని చేసుకుంటున్నారా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలనెలా రూ.2500లు ఇచ్చారని చేసుకుంటారా? వృద్దులకు రూ.4 వేల ఆసరా, పేదలకు ఇండ్లు ఇచ్చారని చేసుకుంటారా? దేనికోసం అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.