ఇంట్లోని పదార్థాలతో చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. టమాటా గుజ్జులో కొంచెం పెరుగు, తేనె కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దాన్ని ముఖంపై అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడగాలి. లేదా శనగపిండిలో 2 స్పూన్ల పెరుగు కలిపి ముఖానికి స్క్రబ్‌లా మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత కడగాలి. సగం అరటి పండులో టీ స్పూన్ తేనె కలిపి మెత్తగా చేసుకోవాలి. ముఖానికి దాన్ని అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడగాలి.