కంప్యూటర్‌పై గంటల తరబడి పనిచేసే వారికి ప్రధానంగా వెన్నెముక సమస్యలు రావడం సాధారణం. సరైన కుర్చీలో కూర్చుంటే వెన్నెముక సమస్య రాకుండా అడ్డుకోవచ్చు. నడుము కటిభాగంలో సపోర్ట్ ఉండాలి. టేబుల్, కుర్చీ ఎత్తులు నిర్ణీత కొలతల్లో ఉండేలా చూసుకోవాలి. పని మధ్యలో 10 నిమిషాలైనా విరామం తీసుకుని, నాలుగు అడుగులు వేస్తుండాలి. కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కంప్యూటర్‌పై సరైన వెలుతురు పడేలా చూసుకోవాలి.