TG: డెక్కన్ సిమెంట్స్ విషయంలో కొండా సురేఖ, సీఎం మధ్య పంచాయితీ నడించిందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. మేడారం టెండర్లు తన కంపెనీకి దక్కలేదని మంత్రి పొంగులేటి రద్దు చేయించారని ఆరోపించారు. లిక్కర్ హాలోగ్రామ్ టెండర్లలో జూపల్లికి, సీఎం మధ్య పంచాయితీ నడిచిందన్నారు. కోమటిరెడ్డికి సంబంధం లేకుండా సినిమా టికెట్ రేట్ల పెంపు జరిగిందని చెప్పారు.