TG: వికారాబాద్ దాడి ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. ప్లాన్ ప్రకారమే దాడి చేశారని మండిపడ్డారు. దాడిని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తుందని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించిందన్నారు. రైతులను సభాస్థలికి రాకుండా అడ్డగించారని, రైతులను కొందరు రెచ్చగొట్టి కలెక్టర్‌పై భౌతికదాడికి పాల్పడేలా చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు.