ప్రముఖ యూట్యూబర్ అన్వేష్‌పై భారత్‌లో ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆస్ట్రేలియాలోనూ అతడిపై ఫిర్యాదు చేశారు. భారతీయ సాంప్రదాయాలను, హిందూ దేవతలను కించపరిచేలా అన్వేష్ వ్యాఖ్యానించడంపై ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇకపై ఆస్ట్రేలియా రాకుండా అతడి వీసా రద్దు చేయాలని ఇమిగ్రేషన్ అధికారులను కోరారు.