ఇవాళ కార్తీకమాసం ఆఖరి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. శివనామస్మరణతో శివాలయాలు మార్మోగుతున్నాయి. భక్తులు తెల్లవారుజామునుంచే నదీస్నానం ఆచరించి దీపాలు వెలిగిస్తున్నారు. శైవక్షేత్రాల్లో అభిషేకాలు, రుద్రాభిషేకాల్లో భక్తులు పాల్గొంటున్నారు.