భారత్‌ను రష్యా-చైనాలతో కలిపి చూడవద్దని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పశ్చిమ దేశాలను కోరారు. భారత్ ఒక సూపర్‌పవర్‌గా ఉద్భవిస్తున్న దేశమని ప్రశంసించారు. భారత్‌తో పశ్చిమ దేశాలు తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత వైవిధ్యభరితంగా ఉండాలని స్టబ్ పేర్కొన్నారు.