AP: విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల పోస్టుల భర్తీకి డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు. పోస్టులు ఇప్పిస్తామంటూ ఎవరైనా చెబితే నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం, విద్యుత్ శాఖకు చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. పోస్టుల అమ్మకాలపై మీడియా కథనాలపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు వెల్లడించారు. తప్పు తేలితే ఎంతటివారైనా వదిలేది లేదని స్పష్టం చేశారు.