దేశవ్యాప్తంగా ఇటీవల ‘బుల్డోజర్’ చర్యలు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. చట్టబద్ధమైన పాలన జరుగుతున్న సమాజంలో బుల్డోజర్ న్యాయం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ చర్యల ద్వారా పౌరుల గొంతు నొక్కడం సరికాదన్నారు. ప్రజల నివాసాల రక్షణ, భద్రత వారి ప్రాథమిక హక్కుల కిందకు వస్తాయని.. వాటిని కూల్చే అధికారం ప్రభుత్వాలకు లేదన్నారు. దీనికి అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.