TG: మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మూసీలో పారాల్సింది మురికి నీరు కాదని, తాగే నీరు పారాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. మూసీ నిర్వాసితుల ఇల్లు కూలగొట్టి పెద్దలకు, కార్పొరేట్ కంపెనీలకు ఆ భూములు కట్టబెట్టే ఆలోచనను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. సీఎం హోదాని మరిచిపోయి ప్రజల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.