TG: తాను నివాసం ఉంటున్న ఇల్లు బఫర్ జోన్లో లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ‘మధురానగర్‌లో నివాసం ఉంటున్న ఇంటిని దశాబ్దాల క్రితం మా నాన్న కట్టించారు. ఒకప్పటి పెద్ద చెరువునే కృష్ణకాంత్ పార్కుగా మార్చారు. చెరువు కట్టకు దిగువన 10 మీటర్లు దాటాక ఉన్న నివాసాలు బఫర్‌జోన్ పరిధిలోకి రావు. అయినా కట్టకు కిలోమీటరు దూరంలో మా నివాసం ఉంది’ అని పేర్కొన్నారు.