TG: హైదరాబాద్ పాతబస్తీలోని హోటల్స్పై పోలీసులు దాడులు చేశారు. బార్కాస్ నుంచి పహాడిషరీఫ్ వరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. తలుపులు మూసేసి ఓనర్స్ రాత్రంతా హోటల్స్ నడిపిస్తున్నారు. అర్ధరాత్రి రెండున్నర గంటల తర్వాత యువకులు ఫుడ్ తింటున్నట్లు గుర్తించారు. కాగా హోటల్స్ యజమానులతోపాటు కస్టమర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రాత్రంతా హోటల్స్ నడిపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.