AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ఇవాళ శ్రీలంక- తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.