జార్ఖండ్‌లో భూకంపం సంభవించింది. రాంచీ, జంషెడ్‌పూర్‌తో పాటు పలు జిల్లాల్లో ఇవాళ ఉదయం భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఖర్సావాన్ జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. ఈ ఘటనతో జనం తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.