AP: పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన ముగిసింది. నాలుగు రోజుల పర్యటనలో పలు అంశాలపై బృందం చర్చించింది. ఎగువ కాఫర్ డ్యామ్‌కు బట్లర్ ఏర్పాటు చేయాలని సూచించింది. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించవచ్చని బృందం తెలిపింది. కొత్త డయాఫ్రమ్ వాల్ పూర్తయిన తర్వాత సమాంతరంగా ప్రధాన డ్యామ్ నిర్మించాలని నిపుణులు సూచించారు. ఈ మేరకు సమగ్ర నివేదికను ప్రభుత్వాని ఇవ్వనున్నారు.