TG: నేడు నిజామాబాద్ జిల్లాలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పర్యటించనున్నారు. కందకుర్తి త్రివేణి సంగమంలో గంగా హారతి కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు డాక్టర్ కేశవరావు బలిరాం హెగ్డేవార్ స్ఫూర్తి కేంద్రం ప్రాజెక్టులు పరిశీలించనున్నారు. బండారు దత్తాత్రేయ హైదరాబాద్ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు త్రివేణి సంగమం పుష్కర ఘాట్ వద్దకు చేరుకోనున్నారు.