2036 ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహణకు భారత్ సిద్ధంగా ఉందంటూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఒలంపిక్ కమిటీకి లేఖ రాసింది. అక్టోబర్ 1న ఐఒసీ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్కు భారత ఒలంపిక్స్ సంఘం లేఖ రాసినట్లు పీటీఐ వెల్లడించింది. అయితే 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు ఏ దేశానికి దక్కుతాయన్న విషయంపై వచ్చే ఏడాది క్లారిటీ రానుంది.