చలికాలంలో నారింజ పండ్లు తింటే పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచి, గుండె జబ్బులు, క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుంది. ఇందులోని హెస్పరిడిన్ అనే ఫ్లేవనాయిడ్ రక్తపోటును నియంత్రిస్తూ, గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది. నారింజల్లో అధిక మోతాదులో పీచులు దొరుకుతాయి. ఇవి మలబద్దకాన్ని పోగొట్టి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. చిగుళ్లవాపు, రక్తం కారడంలాంటి వాటిని నివారిస్తుంది.