AP: రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఐదేళ్ల పాలనలో అన్నీ కల్తీ చేశారని.. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందనేది వాస్తవమని చెప్పారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని అభిప్రాయపడ్డారు. దోచుకున్న అంశం డైవర్ట్ చేయడానికే డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ప్రచారం మొదలు పెట్టారని మంత్రి మండిపడ్డారు.