అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన 22 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. దీంతో ఆయనకు 210 ఎలక్టోరల్ సీట్లు లభించినట్లయ్యింది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 112 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 సీట్లు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ రావాలంటే.. 270 సీట్లు గెలుపొందాలి.