AP: మద్యం ధరల స్థిరీకరణకు త్వరలోనే టెండర్ కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. డిస్టిలరీస్ను టెండర్ కమిటీ సంప్రదించి ధరలు నిర్ణయిస్తుందన్నారు. ఇప్పటికే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో తెచ్చామన్న రవీంద్ర.. మద్యం దుకాణాలను పారదర్శకంగా కేటాయించాలని అధికారులను ఆదేశించారు. గీత కార్మికులకు 340 దుకాణాల కేటాయింపునకు త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి.. నవంబర్ 15లోపు కేటాయిస్తామన్నారు.