AP: తెలుగు మహిళలు ఇంటిని సమర్థంగా నిర్వహిస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు. మన రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఒక ఆర్థికమంత్రి ఉన్నారు. ఆడపిల్లల విషయంలో మగవారి ఆలోచనా విధానం మారలని, టీడీపీ పాలన వల్ల మగవారితో సమానంగా మహిళలు రాణిస్తున్నారని తెలిపారు. మహిళలు అన్ని వేళలా ఆత్మగౌరవంతో జీవించాలన్నారు. మహిళలను దృష్టిలో పెట్టుకొని అనేక పథకాలు తెచ్చామని, గతంలో ఆడపిల్లలకు సైకిళ్లు పంపిణీ చేశామన్నారు.