AP: నీతి ఆయోగ్ సీఈవో ఇవాళ సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సెక్రటేరియట్లో సీఎం, నీతి ఆయోగ్ సీఈవో భేటీ అవుతున్నారు. రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఇద్దరి భేటీకి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా ఆగస్టు చివరి వారంలో సీఎం చంద్రబాబుతో నీతి అయోగ్ ప్రతినిధులు భేటీ అయ్యారు.