అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ వైపు యువ ఓటర్లు ఎక్కువగా మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అసోసియేటెడ్ ప్రెస్ ఓట్ కాస్ట్లో ఈ విషయం వెల్లడైంది. 2020 ఎన్నికల నాటితో పోలిస్తే చాలా డెమోగ్రఫిక్ గ్రూపులు ఈసారి ట్రంప్ పక్షం వహించినట్లు తేలింది. 30ఏళ్ల లోపు వారిలో గతంలో పదింట ముగ్గురు మాత్రమే ట్రంప్‌నకు మద్దతుగా ఉండగా.. ఈసారి ఆ సంఖ్య నలుగురికి చేరింది.