ఆదాయపు పన్ను చట్టం 1961పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న అధికారులతో భేటీ అయ్యారు. ఈ చట్టాన్ని మరింత సులభంగా అర్థం చేసుకునేందుకు, చదివేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీని వల్ల ట్యాక్స్ వివాదాలు, వ్యాజ్యాలు తగ్గుతాయన్నారు. దీంతో ట్యాక్స్ చెల్లించేవారికి స్పష్టత పెరుగుతుందని వెల్లడించారు.