AP: హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తిరుపతిలో పదోతరగతి బాలికపై జరిగిన లైంగిక దాడి విషయంలో అనిత చేసిన వ్యాఖ్యలపై రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆ ఆడబిడ్డ తండ్రి తన బిడ్డకి న్యాయం చేయాలని వేడుకుంటుంటే ఆవేదన మీకు కనిపించలేదా? ఎవరి మెప్పుకోసం ఈ దాపరికాలు? వాస్తవాలు దాచి కేసును పక్కదారి పట్టిస్తున్నందుకు సిగ్గు పడండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.