అలబామాలో నైట్రోజన్ గ్యాస్ ఉపయోగించి దోషికి మరణశిక్ష అమలు చేశారు. పనిచేసే చోట ముగ్గురుని హతమార్చిన కేసులో దోషి అయిన మిల్లర్ అనే వ్యక్తికి ఈ శిక్షను విధించారు. అలబామాలో ఈ పద్ధతిలో శిక్ష అమలు చేయటం ఇది రెండో సారి. అయితే ఈ విధానంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొదటిసారి నైట్రోజన్ గ్యాస్‌తో మరణశిక్ష అమలుకు ముందు ఆ పద్ధతికి వ్యతిరేకంగా న్యాయవాదులు కోర్టులో పోరాడినా ఫలితం లేకుండా పోయింది.