»Will Be Killed In 2 Weeks Atiq Ahmeds Brother Ashraf Cm Adityanath Understands His Pain
Atiq Ahmed Brother: నన్ను 2 వారాల్లో చంపేస్తారేమో, యోగికి బాధ తెలుసు.. అతీక్ సోదరుడి భయం
ఉత్తర ప్రదేశ్ లో (Uttar Pradesh) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) పాలనలో మాఫియా డాన్ లు (mafia don) వణికి పోతున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే, ఇష్టారీతిన ప్రవర్తిస్తే యోగి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. యోగి తీరు ఉగ్రవాదులు, మాఫియాను ఆందోళనకు గురి చేస్తోంది.
ఉత్తర ప్రదేశ్ లో (Uttar Pradesh) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) పాలనలో మాఫియా డాన్ లు (mafia don) వణికి పోతున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే, ఇష్టారీతిన ప్రవర్తిస్తే యోగి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. యోగి తీరు ఉగ్రవాదులు, మాఫియాను ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల ప్రయాగ్ రాజ్ కోర్టులో (prayagraj court) హాజరు పరిచేందుకు మాఫియా డాన్ అతిక్ అహ్మద్ ను (Atiq Ahmed) అహ్మదాబాద్ నుండి తీసుకు వచ్చారు పోలీసులు. ఆ సమయంలో తనను చంపేస్తారేమోనని అతను మీడియా ఎదుట వాపోయాడు. తాజాగా, అతని సోదరుడిని కూడా అదే భయం పట్టుకున్నది. 2006లో ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో అతీఫ్ తో పాటు అతని సోదరుడు అష్రాఫ్ (Atiq Ahmed brother Ashraf) కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం బరేలీ జైలులో ఉన్నాడు. ఇతనికి ఉన్న మరో పేరు ఖలీద్ అజీం అని తెలుస్తోంది.
తనను రెండు వారాల్లో జైలు నుండి బయటకు రప్పించి చంపేస్తారని ఓ సీనియర్ అధికారి (Senior Officer) తనను బెదిరించాడని, తన పైన మోపిన అభియోగాలు అన్ని కూడా నిరాధారమైనవని, తప్పుడు కేసులతో తనను ఇబ్బంది పెడుతున్న విషయం, తాను పడుతున్న బాధ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు (Yogi Adityanath) కూడా తెలుసునని, ఆయన అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. అలా బెదిరించిన అధికారి ఎవరు అని అడగగా.. పేరు చెప్పేందుకు నిరాకరించారు. తాను హత్యకు గురైతే ఓ ఎన్వలోప్ లో ఆ పేరు ముఖ్యమంత్రికి చేరుతుందన్నారు.
ఇదిలా ఉండగా, అతిక్ అహ్మద్ ను ప్రయాగ్ రాజ్ కోర్టులో హాజరుపరిచారు. అతనిని దోషిగా తేల్చిన, స్పెషల్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు జీవిత ఖైదును విధించింది. ఈ గ్యాంగ్ స్టర్ తో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. అతిక్ సోదరుడు అష్రఫ్ సహా ఏడుగురికి విముక్తి లభించింది. పదిహేడేళ్ల నాటి కిడ్నాప్ కేసులో యూపీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్ పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్ ప్రధాన నిందితుడు. 2019 నుండి సబర్మతి జైల్లో ఉన్నాడు. ఇతని పైన 100కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. రాజ్ పాల్ హత్య కేసులో ముఖ్య సాక్షి ఉమేష్ పాల్ 2006లో కిడ్నాప్ కు గురయ్యాడు. ఇందుకు సంబంధించి 2007లో కేసు నమోదయింది. కేసు విచారణ చివరి రోజు అతను హత్యకు గురయ్యాడు. అయితే అతిక్ అహ్మద్ కు జీవిత ఖైదు పడినప్పటికీ జైలు నుండి కూడా ఏమైనా చేయగలడని ఉమేష్ పాల్ తల్లి ఆందోళన వ్యక్తం చేశారు.