టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni)కి బైకులంటే పిచ్చి అని తెలిసిందే. అలాగని, ధోనీ వద్ద కార్ల కలెక్షన్ తక్కువ అనుకుంటే పొరబడ్డట్టే. ఆధునిక కార్లతో పాటు ఈ తరం వారికి తెలియని పాత మోడల్ కార్లు (Old model cars) కూడా ధోనీ గ్యారేజిలో కనిపిస్తాయి. ధోనీ ఇంట ఉండే ప్రత్యేక గ్యారేజి (Garage) గురించి చెప్పాలంటే…. ఓ షోరూంకి వెళ్లినట్టే ఉంటుంది. అక్కడ అనేక బైకులు, కార్లు కొలువుదీరి ఉంటాయి. తాజాగా, ధోనీ రాంచీ రోడ్లపై 1973 నాటి పాంటియాక్ ట్రాన్స్ ఏఎం ఎస్ డీ-455 కారును డ్రైవ్ చేస్తే కెమెరా కంటపడ్డాడు. ఇది విదేశీ కారు.. దీని స్టీరింగ్ వీల్ ఎడమవైపున ఉంటుంది. పాత మోడల్ కారు అయినప్పటికీ, ధోనీ దీన్ని ఇప్పటికీ మంచి కండిషన్ లో పెట్టడం విశేషం. ధోనీ ఎంచక్కా పాంటియాక్ కారు(Pontiac car)ను నడపుతూ ఆస్వాదిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి కార్లు, బైక్లు ఉన్న ఆసక్తి గురించి తెలిసిందే.తాజాగా తన గ్యారేజిలో ఉన్న వింటేజ్ కారు 1973 పోంటియాక్ ట్రాన్స్ యామ్ SD-455’ను డ్రైవ్ చేస్తూ కెమెరాలకు చిక్కారు. రాంచీలో ధోనీ కారు డ్రైవింగ్ చేస్తూ కనిపించడంతో.. ఫ్యాన్స్ వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ధోనీ లుక్ ఆకట్టుకుంటోందని నెటిజన్లు (Netizens) ట్వీట్స్ చేస్తున్నారు.ఆధునిక కార్లతో పాటు ఈ తరం వారికి తెలియని పాత మోడల్ కార్లు కూడా ధోనీ గ్యారేజిలో కనిపిస్తాయి. ధోనీ ఇంట ఉండే ప్రత్యేక గ్యారేజి గురించి చెప్పాలంటే…. ఓ షోరూంకి వెళ్లినట్టే ఉంటుంది. అక్కడ అనేక బైకులు(Bikes), కార్లు కొలువుదీరి ఉంటాయి.