జీఎస్టీ కౌన్సిల్ (GST Council meet) 50వ సమావేశం న్యూఢిల్లీలో ముగిసింది. ఆన్లైన్ గేమింగ్ (Online gaming) ముఖ విలువలో 28 శాతం ట్యాక్స్ విధింపునకు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) అధ్యక్షతన సమావేశమైన 50వ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ గేమింగ్(Online gaming), క్యాసినో, గుర్రపు పందేలు వంటి బెట్టింగులపై 28 శాతం జీఎస్టీ (GST) విధించాలని నిర్ణయం తీసుకుంది. హార్స్ రేసింగ్, క్యాసినోలకు ఇదే రేటు వర్తించనుంది. కాగా ఈ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. నైపుణ్యానికి సంబంధించిన గేమ్ అయినా, డబ్బుల పందెంతో ఆడే గేమ్ అయినా 28 శాతం జీఎస్టీ వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు క్యాన్సర్ సంబంధిత ఔషధాలు, అరుదైన వ్యాధులకు మెడిషిన్లు, ప్రత్యేక వైద్య పరిస్థితుల్లో అవసరమయ్యే ఆహార ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయింపునిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థికమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలని నిర్మల మీడియా సమావేశంలో వెల్లడించారు.బెట్టింగులపై మంత్రుల బృందం సిఫార్సులకు అనుగుణంగా జీఎస్టీ రేటు(GST rate)ను నిర్ణయించినట్లు చెప్పారు. ఆన్ లైన్ గేమింగ్‌పై తొలుత ముఖ విలువపై పన్ను వేయాలా? గేమింగ్ ఆదాయంపై పన్ను వేయాలా? ప్లాట్ ఫామ్ ఫీజు మీద మాత్రమే వేయాలా? అనే అంశంపై మంత్రుల బృందం చర్చించిందని, చివరకు మొత్తం విలువ మీద పన్ను విధించాలని నిర్ణయించినట్లు తెలిపారు.నైపుణ్యానికి సంబంధించిన ఆట అయినా, డబ్బులతో ఆడే ఆట అయినా ఆన్ లైన్ గేమ్ లకు 28 శాతం జీఎస్టీ ఉంటుందన్నారు.మరోవైపు, క్యాన్సర్ మెడిసిన్ (Cancer Medicine) దినుటక్సిమాబ్, ఇతర అరుదైన వ్యాధులతో బాధపడే రోగులు దిగుమతి చేసుకునే ఆహారంపై జీఎస్టీ మినహాయంపు ఇచ్చింది. ప్రయివేటు కంపెనీల ఉపగ్రహ ప్రయోగ సేవలకు జీఎస్టీ మినహాయింపు ఉంటుందన్నారు. సినిమా థియేటర్లలో విక్రయించే ఫుడ్, పానియాలపై పన్నును 18 శాతం నుండి 5 శాతానికి తగ్గించింది.