ఉత్తరప్రదేశ్ లో లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలా బెహ్రైచ్ జాతీయ రహదారిపై స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారులో స్కూటీ ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు పాదాచారులను బలంగా ఢీకొట్టింది. మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాద ఘటనపై యూపీ మాజీ సీఎం, అఖిలేష్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.