»Dantewada Security Personnel Maoist Ied Blast In Chhatisgarh
Dantewada: దంతెవాడలో మావోల మందుపాతర… 11 మంది పోలీసుల మృతి
ఛత్తీస్‌గఢ్(chattisgarh)లో విషాదం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు నిశ్శబ్ధంగా మావోయిస్టులు(maoists) మళ్లీ రెచ్చిపోయారు. పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర(Explosives) పేల్చారు.
Dantewada: ఛత్తీస్‌గఢ్(chattisgarh)లో విషాదం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు నిశ్శబ్ధంగా మావోయిస్టులు(maoists) మళ్లీ రెచ్చిపోయారు. పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర(Explosives) పేల్చారు. మావోయిస్టుల ఘాతుకానికి 10మంది పోలీసులు(Police), డ్రైవర్(Driver) మొత్తం 11మంది ప్రాణాలు కోల్పోయారు. దంతెవాడ జిల్లా(dantewada)లోని అరాన్పూర్ ప్రాంతంలో ఈ దారుణం జరిగినట్లు సమాచారం. ఈ పేలుడులో మొత్తం 11 మంది చనిపోయినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఆంధ్రా, తెలంగాణ(Telangana) సరిహద్దుల్లో ఉన్న బీజాపూర్, జగదల్పూర్, దంతెవాడ, సుకుమా జిల్లాలు మావోయిస్టులకు కేంద్రప్రాంతాలుగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ ప్రాంతాల్లో మావోల అలజడి కాస్త తగ్గింది. అయితే అదును చూసి మావోలు పోలీసులను టార్గెట్(Target) చేసినట్లు తెలుస్తోంది. వారి కోసమనే మావోయిస్టులు ఈ భారీ పేలుడుకు ప్లాన్ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇంప్రూవైడ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్(ఐఈడీ)(IED) బ్లాక్ చేసి ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. పోలీసులు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ ముగించుకుని వస్తున్న క్రమంలో మావోలు ఈ దాడి చేశారు.
ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్(Chief Minister Bhupesh Baghel) ఘాటుగా స్పందించారు.. మావోయిస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, నక్సలిజాన్ని రూపుమాపుతామని అన్నారు. దీనిపై తమకు సమాచారం అందిందని..ఇది విచారకరమని వ్యాఖ్యానించారు. పేలుడులో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.