యువ నటీనటులు చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఎంటర్టైనర్ మూవీ ‘ధూం ధాం’. దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. నవంబర్ 8న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ LLP వారు దీని విడుదల చేస్తున్నారు. ఇక గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.