డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘లైగర్’ వివాదం నుంచి ఇప్పట్లో బయటపడేలా కనిపించడం లుదు. దాదాపు మూడేళ్లు లైగర్ సినిమా కోసం కష్టపడ్డాడు పూరి. కానీ లైగర్ రిజల్ట్ రివర్స్ అయిపోయింది. అయితే సినిమా అన్నాక హిట్, ఫట్ అనేది కామన్.
లైగర్ కూడా ఫ్లాప్ అయిపోయింది కాబట్టి.. మిగతా సినిమాల్లాతే ఫ్లాప్ మూవీస్ లిస్ట్‌లోకి వెళ్లిపోయింది. కానీ అంతటితో ఆగలేదు లైగర్ వివాదం. ఈ సినిమా తెచ్చిన నష్టాలతో పూరి మరియు ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య పెద్ద పంచాయితే జరిగింది. ఇంకా ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడక ముందే.. ఇప్పుడు ఈడీ ఎంట్రీతో వ్యవహారం కొత్త రాజకీయ మలుపు తిరిగింది.
లైగర్ సినిమాలో విదేశీ పెట్టుబడులున్నాయనే అనుమానంతో.. పూరీ జగన్నాధ్- ఛార్మీలనుఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేసింది. లైగర్ ఆర్ధిక లావాదేవీలపై దాదాపు 13 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. లైగర్ సినిమాకి పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి.. దీని వెనక హవాలా, మనీ లాండరింగ్ లాంటి వ్యవహారం ఉందా.. అనే పాయింట్లో ఈడీ దర్యాప్తు సాగుతున్నట్టు తెలుస్తోంది. లైగర్ పెట్టుబడిలో మేజర్ వాటా బ్లాక్ మనీదేనని..
పలువురు రాజకీయ నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని.. దానిపై ఈడీకి కంప్లైంట్ వెళ్లిందని.. అందుకే విచారణ జరుగుతున్నట్టు ఇన్సైడ్ టాక్. అలాగే విజయ్ దేవరకొండ కోసమే బ్లాక్ మనీని వైట్‌గా మారుస్తున్నట్టు మరో టాక్.
ఒకవేళ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)ను పూరి, చార్మీ నిజంగానే అతిక్రమించినట్టు తేలితే.. వాళ్లకు మరిన్ని కష్టాలు తప్పవంటున్నారు. అదే జరిగితే పూరి నుంచి మరో సినిమా రావడానికి చాలా సమయం పట్టేలా ఉందంటున్నారు. కానీ అసలు లైగర్ బడ్జెట్ వ్యవహారం ఈడీ దృష్టికి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.